సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 5 రోజులుగావందలాది విమానాలు సర్వీసులను రద్దు చేస్తూ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఇడింగో సంస్థ నేడు, ఆదివారం కూడా 650 ఫ్లైట్‌లను రద్దు చేసినట్టు తాజాగా తెలిపింది. ఇక టికెట్స్ క్యాన్సిలేషన్‌తో ఇబ్బంది పడ్డ వారికి రీఫండ్‌లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. దీంతో, విమానాశ్రయాల్లో అనేక మంది పడిగాపులు పడుతున్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సీఈఓ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌తో కూడిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూపును కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిజానికి ఇడింగో ప్రతి ఆదివారాలు సగటున 2,300 విమానలను నడుపుతుంది. అయితే, నేడు మాత్రం 1,650 విమాన సర్వీసులు నడుపుతామని తెలిపింది. డిసెంబర్ 10 నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తాయని పేర్కొంది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో ఇండిగో ఫ్లైట్‌లు ఎక్కువగా రద్దయ్యాయి (IndiGo Flight ).
