సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటన అందరిని కలచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్కరు మాత్రం మృత్యుంజయుడిగా బయట పడ్డారు. ఇక విమానం కూలిపోతూ స్థానిక మెడికల్ కాలేజ్ హాస్ట్‌లోకి దూసుకెళ్లడంతో అక్కడ మెస్ లో భోజనం చేస్తున్న 33 మంది మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. బోయింగ్ విమానాల సామర్థ్యం నిర్వహణలో అలసత్వం ఫై ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో తాజాగా ఈ విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజులు భారంగా గడిచిందని.. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు తెలుసునని నా తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే నేను సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాం. ప్రమాదం స్థలాన్ని పరిశీలించాను. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో కమిటీ వేసినట్లు తెలిపారు. మరో 3 నెలలలో దీని పూర్తీ స్థాయి రిపోర్ట్ వస్తుందని తెలిపారు. మెడికల్, ఫోరెన్సిక్, టీమ్‌లతో పాటు ఐదుగురితో ఏఐబీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బ్లాక్ బాక్స్‌ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని..అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *