సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర, పుణేలో నేడు, బుధవారం ఉదయం జరిగిన చార్టర్డ్ విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్(Ajit Pawar) దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతోపాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బారామతిలో బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్న… ఈ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉదయం 8:45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ వయసు 66 సంవత్సరాలు.. విమానం బారామతిలో ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలినట్టు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. విమానంలో ఉన్న 5గురిలో ఏ ఒక్కరూ ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడలేదు. వీరి మృతి పట్ల ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ , మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.
