సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు ఆదివారం కూడా విరామం లేకుండా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భీమవరం మండలంలోని నరసింహపురం గ్రామంలో ఇంటింటికి తిరిగారు. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ .. తనకు ప్రజా సేవలోనే సంతృప్తి ఉందని, ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో కేవలం 3 ఏళ్లలో 98 శాతానికి పైగా నెరవేర్చిన సీఎం జగన్ 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ గ్రామ పర్యటనలో భాగంగా ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.నేడు, మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఆయన కార్యాలయంలో స్నేహపూర్వకంగా కలసి కొద్దీ సేపు గడపడం జరిగింది.
