సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ లో అనేక కేసులలో నిందితుడుగా ఉండి దేశం విడచి 2018 నవంబర్‌లో పారిపోయి తనకు తాను కైలాస దేశ అధినేతగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామి సంచలనాలకు కొదవేముంది. ఎక్కడో ఈక్వెడార్ దేశం వద్ద ప్రపంచ గుర్తింపు లేని ద్విప భూభాగం లో ఆశ్రమాలు నిర్మించుకొని అక్కడ కు తన అమాయక భక్తులను తీసుకొనివెళ్ళి అదే తన స్వంత దేశం అంటూ అందరిని భ్రమింప చేస్తున్న నిత్యానంద స్వామి కి గత ఏడాది కాలంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి నిత్యానంద వైద్యసాయం కోసం సాక్షాత్తూ శ్రీలంక అధ్యక్షుడికి ఇటీవల ఆగస్టు 7వ తేదీన లేఖ రాశారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేకు నిత్యానంద రాసిన లేఖ తాజాగా వెలుగుచూసింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు సమాచారం. తన ఆరోగ్యం క్షీణించిందని, ఆశ్రయం కల్పించి వైద్యసాయం చేయాలని,తమ సార్వభౌమ రాజ్యమైన శ్రీకైలాసలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కొరత ఉందని కాబ్బటి శ్రీలంక లో తనకు వైద్యం చేయిస్తే అందుకు ప్రతిగా శ్రీలంకలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ లేఖ సారాంశం గా వార్త కధనాలు వెలువడుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *