సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, ఆదివారం సాయంత్రం ముఖ్య మంత్రి వైఎస్ జగన్, పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో పర్యటించారు. నరసాపురం ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్, ముదునూరి ప్రసాదరాజు కుమార్తె డాక్టర్ సింధు వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. తాడేపల్లి నుండి హెలికాఫ్టర్ లో చేరుకొన్న సీఎం జగన్ కు కల్యాణ మండపం వరకు భారీ జనసందోహం మధ్య మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, భీమవరం ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ , వంకా రవీంద్ర నాధ్ తదితరులు స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *