సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో పెద్ద కుట్ర ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి మొదటి నుండి చెపుతున్నట్లు, ఇప్పుడు ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చింది. వివేకా 2వ భార్య ష్యమిమ్ సిబిఐ కి ఇచ్చిన వివరణ తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. దానిలో.. . వివేకానంద కూతురు సునీతా , అల్లుడు కల్సి తనను ఎంతగా వేధించింది ఎంత నీచంగా సంబోధిస్తూ మెసేజ్ లు పెట్టేవారో ఆమె వివరణ మీడియాకు లీక్ అయ్యి తెలుగు రాష్ట్రాలలో సంచనలం సృష్టిస్తుంది. వివేకా నంద కూతురు సంబంధిత వ్యక్తులపై వారిని నడిపిస్తున్న ‘బలమైన వ్యక్తి’ ఇతనే అంటూ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోల్స్ నడుస్తున్నాయి.వివేకా కేసు విచారణను ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. సీబీఐ కూడా విచారణను వేగవంతం చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం మొదలుకుని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. ఇప్పటి వరకు సిబిఐ దృష్టిసారించని వివేకా రెండో పెళ్లిపై …ఇంత చర్చ జరుగుతున్న వేళ.. ఆయన రెండో భార్య షమీం, గత శుక్రవారం ఇచ్చిన వాంగ్మూలంలో .. వివేకాతో నాకు రెండుసార్లు పెళ్లి జరిగింది, మా పెళ్లి వివేకా ఫ్యామిలీకి ఇష్టం లేదు. శివప్రకాష్‌రెడ్డి నన్ను, మా కుటుంబీకులను చాలాసార్లు బెదిరించారు..నాకు వివేకాకు పుట్టిన కుమారుడు కోసం వివేకా 4 ఎకరాల భూమి కొందామని భావిస్తే భూమి కొనకుండా వివేకాను శివప్రకాష్‌రెడ్డి అడ్డుకున్నారు. అలాగే వివేకాకు దూరంగా ఉండాలని సునీతారెడ్డి నన్ను హెచ్చరించారు. వివేకా ఆస్తిపై , పదవిపై శివప్రకాష్‌రెడ్డికి వ్యామోహం పెంచుకొన్నాడు. వివేకాను కుటుంబ సభ్యులే దూరం పెట్టారు. అయన నాకు డబ్బు ఇవ్వకుండా చెక్ పవర్ కూడా తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అని కీలక అంశం ప్రస్తావించింది. వివేకా చనిపోతే శివప్రకాష్‌రెడ్డిపై భయంతో నేను వెళ్లలేకపోయాను అని ఆమె వాపోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *