సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మాజీ మంత్రి వివేకా హత్యపై జరిగిన ఘటనలో సిబిఐ దార్యప్తులో విస్మరించిన కీలక విషయాలు అంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి తాజా గా నేడు, బుధవారం మీడియాకు ప్రజలకు ఒక ప్రత్యక వీడియో విడుదల చేసారు. దానిలో ఆయన మాట్లాడుతూ… వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. ఆ ఉదయం .. వివేకా గుండెపోటుతో మరణించినట్లు మొదట శివప్రకాష్‌రెడ్డి తనకు చెప్పారన్నారు. తాను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నానన్నారు. పులివెందుల రింగ్‌రోడ్డు దగ్గరున్నప్పుడు కాల్ వచ్చిందన్నారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా? అని అడిగానన్నారు. తాను వెళ్లక ముందే వివేకా రాసిన లేఖ, సెల్‌ఫోన్‌ను వై ఎస్ వివేకా కుమార్తె సునీతా భర్త రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళు దాచేశారన్నారు. వివేకా ఆఖరిసారిగా ప్రాణాలు నిలుపుకొని రాసిన లేఖలో డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని రాశారన్నారు. లేఖ, సెల్‌ఫోన్ దాచమని రాజశేఖర్‌రెడ్డి తనకు స్వయంగా చెప్పారని అవినాశ్‌రెడ్డి వెల్లడించారు.వివేకా హత్య కేసులో ఆ లెటరే కీలకమని అవినాశ్‌రెడ్డి తెలిపారు. అలాంటి లేఖను ఎందుకు దాచారని అడిగితే.. రాజశేఖర్‌రెడ్డి చెప్పిన సమాధానం హాస్యాస్పదమన్నారు. లెటర్‌లో డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేశారని వివేకా రాశారన్నారు. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతని గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే.. ప్రసాద్‌పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్‌రెడ్డి తనకు చెప్పారని అవినాశ్ రెడ్డి తెలిపారు. సునీతా నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్‌నే నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఆ లెటర్‌పై సీబీఐ ఎందుకు విచారించడం లేదో? అర్ధం కావడం లేదన్నారు. ఈ మర్డర్ కేసులో నా కుటుంబాన్ని ఇరికించి ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారని, సునీతా చంద్రబాబు డైరెక్షన్ లో నడవడం వెనుక రహస్యం ఏమిటి ? అని అవినాశ్‌రెడ్డి ప్రశించారు.
