సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఉదయం సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం వారితో ఒప్పందపు సంతకాలు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ‘‘రాష్ట్రానికి గూగుల్‌ను తీసుకువచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రతిసారి మీరు మీ సామర్ధ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు’’ అంటూ సీఎంను పవన్ పొగడ్తల వర్షం కురిపించారు. తదుపరి కలెక్టర్లు తో వీడియో సమావేశంలో సీఎం చంద్రబాబు గూగుల్ ను అతి త్వరలో వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్నామని మన యువతకు ఉపాధి అవకాశాలు మనమే సృష్టించుకోవాలని ఐటి మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యం అవుతుందని ప్రకటించారు.
