సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఏపీ విద్య శాఖ ఐటీ మంత్రి లోకేష్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్‌గా మార్చుతామని ప్రకటించారు. విశాఖ పరిశ్రమలు, ఐటీ హబ్‌గా మార్చుతున్నామన్నారు. గడిచిన 10 నెలల్లో విశాఖకు చాలా ప్రాజెక్టులు తీసుకువచ్చామని.. రానున్న 5 సంవత్సరాల్లో విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విశాఖను దేశంలోనే విశాఖ ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో మొదటి రెండు అత్యధిక మెజారిటీ స్థానాలు విశాఖకు వచ్చాయన్నారు. దీన్ని బట్టి విశాఖ ప్రజలు తమపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారని అర్థమైందన్నారు. విశాఖ అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. విశాఖలో నేటి సోమవారం నేను శంకుస్థాపన చేసిన వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు… భారతదేశంలోనే ఒక ఐకానిక్ ప్లేస్‌గా మిగులుతుందన్నారు. గడిచిన ఐదేళ్లలోరాష్ట్రంలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారన్నారు. లులు గ్రూప్ కూడా త్వరలో విశాఖకు వస్తుందన్నారు. గడిచిన ఇప్పటికే విశాఖకు టీసీఎస్, మెటల్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ వచ్చాయని, ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలని..అయితే గత సీఎం జగన్ కు మల్లె ‘ మన ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ చేయమంటున్నారు’ అని అన్నారు. ఉత్తరాంధ్రలోనే ట్రిలియన్ డాలర్ ఎకానమీని తీసుకొస్తామని గర్వంగా చెప్తున్నామని ప్రకటించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సంవత్సరంలోపు ప్రారంభం చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *