సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రజా సంక్షేమ పధకాలును మరో రెండింతలు చేస్తానని సూపర్ సిక్స్ కొట్టి చంద్రబాబు అధికారం లోకి వచ్చిన విషయం అందరికి విదితమే.. మరి విశాఖ కూడా ఆర్ధిక రాజధాని అంటూ పదం ఉచ్చరిస్తూ చంద్రబాబు నేడు కీలక షాకింగ్ వ్యాక్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేడు, మంగళవారం ఉదయం విజయవాడ ఎన్డీఏ సమావేశంలో భాగంగా చంద్రబాబు గతంలో జగన్ మాట్లాడిన తరహాలోనే విశాఖ ఫై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇప్పటికే అక్కడ ఋషి కొండపై జగన్ సీఎం కార్యాలయం సిద్ధం చేసుకొన్నా, విశాఖ ను ఐటి హాబ్ గా మార్చాలన్న.. నేపథ్యంలో ఆ నిర్మాణాలు కూడా బాబు ప్రభుత్వం ఉపయోగించుకొనే దిశగా ఆలోచనలు ఉపందు కొంటున్నాయి. నేడు చంద్రబాబు మాటలలో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన బాబు. అయితే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.విశాఖ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోమని స్పష్టం చేశారు. జగన్ చెప్పిన విశాఖ రాజధాని ప్రతిపాదనలు ను అక్కడి ప్రజలు పట్టించుకోలేదని కర్నూలు న్యాయ రాజధాని అనే మోసాలను ప్రజలు గమనించారన్నారు. కర్నూలు అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *