సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్‌, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు వల్ల గోదావరి జిల్లాల ప్రయాణికులకు ప్రయోజనముంది. – నెం.08557 విశాఖపట్టణం-చెన్నై ఎగ్మూర్‌ ప్రత్యేక సమ్మర్‌ స్పెషల్‌ ఈనెల 27, మే 4,11,18,25, జూన్‌ 1,8,15,22,29 తేదీల్లో విశాఖపట్నం నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.45 గంటలకు చెన్నై ఎగ్మూర్‌ చేరుకుంటుంది. తిరుగు మార్గంలో నెం.08558 చెన్నై ఎగ్మూర్‌-విశాఖపట్నం ప్రత్యేక సమ్మర్‌ స్పెషల్‌ ఈ నెల 28, మే 5,12,19,26, జూన్‌ 2,9,16,23,30 తేదీల్లో చెన్నై ఎగ్మూర్‌ నుంచి ఉదయం 10.30 గంటలకు బయల్దేరి రాత్రి 10.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.- నెం.08549 విశాఖపట్నం- బెంగళూరు వారాంతపు ప్రత్యేక రైలు (రేణిగుంట-కాట్పాడి-జోలార్‌పేట మీదుగా) ఈ నెల 27, మే 4,11,18,25, జూన్‌ 1,8,15,22,29 తేదీల్లో విశాఖపట్నంలో మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.08550 బెంగళూరు-విశాఖపట్నం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 28, మే 5,12,19,26, జూన్‌ 2,9,16,23,30 తేదీల్లో బెంగళూరు నుంచి ఉదయం 8.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజు వేకువజామున 3.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *