సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోనే అందమైన నగరం గా పేరొందిన విశాఖపట్నంలో ఇటీవల ప్రఖ్యాత ఐటి కంపెనీలు తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే,, తాజగా ప్రముఖ ఐటీ సం స్థ అమెజాన్ సంస్థ.. తమ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. విశాఖలో సిస్టమ్ సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ సెంటర్, ఐటీ ఆధారిత సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అమెజాన్ దరఖాస్తు చేసుకున్నట్లు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ప్రకటించింది. ప్రాథమిక అనుమతులు మంజూరు చేశామని.. త్వరలోనే సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఎస్టీపీఐ విశాఖ డైరెక్టర్ సీవీడీ రామ్ ప్రసాద్ ప్రకటించారు. అమెజాన్ తొలి దశలో 120 సీటింగ్ సామర్థ్యంతో ఈ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో ఈ కేంద్రం ద్వారా రూ.184.12 కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతాయని ఆ సంస్థ ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. దశలవారీ విస్తరణ అనంతరం .. ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందన్నారు. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థ విశాఖలో అడుగు పెట్టడంతో మరిన్ని కం పెనీల ఏర్పా టుకు ముందడుగు పడుతుందన్నారు.
