సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అందమైన సముద్ర తీరాన్న అంతర్జాతీయ స్థాయిలో కాస్మో లుక్ ఉన్న విశాఖ నగరంలో గత 3ఏళ్లుగా, ఇప్పటికే ఎన్నో ఐటి కంపెనీలు క్యూ కడుతుండగా.. తాజగా మరో ప్రధాన ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు కు రంగం సిద్ధం అవుతుంది. ఒక గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్‌ను గూగుల్ విశాఖపట్నంలోని మధురవాడలో ఏర్పాటు చేయనుంది. దీనికోసం గూగుల్ సుమారుగా రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌గా నిలవనుంది. అమెరికా దేశంలో కాకుండా వేరే దేశంలో గూగుల్ ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రాలలో ఇది ఒకటి కావడం విశేషం. దీనిలో 25వేల మంది ఉద్యోగులు పనిచేసే అవకాసమ్ ఉంది.ఇది దేశానికి ప్రపంచ డిజిటల్ హబ్‌గా గుర్తింపు తెస్తుందని ఈ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇన్వెస్ట్ ఇండియా’ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సేవలకు ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది.
