సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పట్నం కు దేశంలో మరింత కీలక స్తానం పొందడానికి కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్రం లోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాల విషయంలో పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటివరకు ఇమిగ్రేషన్ ప్రక్రియల కోసం హైదరాబాద్, చెన్నై వంటి నగరాలపై ఆధారపడాల్సి వస్తుండగా, ఇకపై విశాఖ నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కావడం వల్ల విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు
