సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ లో ఉక్కు ప్రేవేటీకరణ శరవేగంగా జరిగిపోతుందని కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని వెంటనే.. ఉక్కు ప్రైవేటీకరణ (steel plant) నిలుపుదల చేయాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల నిరావధిక సమ్మె (strike) మంగళవారం ఉధృతంగా మారింది. సమ్మె నిర్వహిస్తున్న ఉక్కు కాంట్రాక్టు కార్మికులు నేడు, మంగళవారం ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం ముట్టడికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు.. పోలీసులకు మధ్య తీవ్రమైన తోపులాట జరిగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. విశాఖ ప్లాంటులో మొత్తం 13,250 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా, వారిలో 33 శాతం మందిని తొలగించాలని యాజమాన్యం భావిస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ నెలలో ఏకంగా 1,731 మందిని తొలగించింది. కాంట్రాక్టు కాలం పూర్తయిన మరో వేయి మందికి గేట్ పాస్‌లు ఇవ్వకుండా అడ్డుకొంది . మరో రెండు వేల మంది తీసేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని భావిస్తూ. దీనిని వ్యతిరేకిస్తూ కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగారు
