సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో 2రోజుల పర్యటనకు గత రాత్రి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకొన్న ప్రధాని మోడీ కి సీఎం జగన్ స్వాగతమ్ చెప్పారు. పర్యటనలో బాగంగా నేడు,శనివారం ప్రధాని మోడీ.. ఆంధ్రప్రదేశ్లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికేపూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అం కితం చేసారు. ఆంధ్రాయూనివర్శిటీ (ఏయూ)గ్రౌండ్స్ లో నేడు,శనివారం 2లక్ష మంది పైగా పాల్గొన్న భారీ బహిరంగ సభా వేదికగా..ఇటీవల పూర్తీ అయిన వాటికీ ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్య మంత్రి వైఎస్ జగన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. గంధపు చెక్కతో చేసిన శ్రీ రామచంద్రుని విగ్రహాన్ని సీఎం జగన్ ప్రధానికి కానుకగా అందజేశారు, ప్రధాని శంకుస్తాపన చేసిన ప్రాజెక్టుల వివరాలు.. రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు…రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే.. రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం.. రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు.. రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మరియు ఇప్పటికే నిర్మాణం పూర్తీ చేసిన రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి జాతికి అంకితం… రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీయుఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *