సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్య టనకు వెళ్తూ 150కి పైగా సీట్లు తమవే అని సంచలన కామెం ట్స్చేశారు. దీనితో వైసీపీ శ్రేణులలో తమ ప్రభుత్వ ఏర్పాటు ధీమా పెరిగింది. దీనికి తోడు విశాఖ లో 9వ తేదీ ప్రమాణ స్వీకారం కోసం వైసీపీ శ్రేణులు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకోవడం దూరప్రాంతాల నుండి టికెట్స్ బుక్ చేసుకోవడం, విశాఖ లో 9వ తేదీ కి వైసీపీ కీలక నేతల కోసం ఇప్పటికే హోటల్స్ లార్జ్ లు బుక్ చేసుకోవడం కూటమి శ్రేణులను విస్తు పోయేలా చేసింది. అయితే కూటమి నేతలు కూడా ప్యూహాత్మకంగా తామే అధికారంలోకి వస్తున్నామని తమకే అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా పందాలు ఎక్కువ జరుగుతున్నాయని సవాల్ విసురుతున్నారు. ఈ మైండ్ గేమ్స్ లో ఎవరిదీ ఫై చెయ్యి అన్నది పక్కన పెడితే మరో 6 రోజులలో జూన్ 4న ఫలితం ఎలానూ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు విజయం ఫై గట్టిగ స్వాందించని చంద్రబాబు నేడు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక, ఏపీలోని అన్ని ప్రాంతాలలో కీలక టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. కౌంటింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ,ఇప్పటికే వైసీపీ ఓటమికి కారణాలు వెతుకుంటుందని, పోస్టల్ బ్యాలెట్ ఫై శ్రద్ద పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ ముఖ్య నాయకులు సజ్జల రామకృ ష్ణారెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి బుధవారం వేర్వేరుగా మాట్లాడుతూ.. అధికారం పై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. సంక్షేమ పాలన అందించిన జగన్‌ను మరోసారి సీఎం చేసుకునేందుకు మహిళలు, సామాజిక భద్రత పింఛన్‌దారులు జగన్‌ను మళ్లీ తెచ్చుకునేందుకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని అన్నారు. వచ్చే నెల నాల్గో తేదీ జరిగే కౌంటింగ్‌లో వైసీపీ విజయం సాధిస్తుందని, 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయం లో ప్రత్యర్థుల కుట్రలు ఆటలు సాగనివ్వ కుండా వైసీపీ ఏజెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.వారం తర్వా త రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడ అవుతుందని సజ్జల అన్నా రు.
.
