సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర స్థాయి జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాలను పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ( pawan) ఆదేశాల మేరకు విశాఖలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. విశాఖ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఇవి మూడ్రోజులు జరుగుతాయన్నారు. జనసేన ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ‘సేనతో సేనాని’ ( sena to senani) పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ ఉంటుందని.. మర్నాడు పార్లమెంటు నియోజకవర్గాలవారీగా పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన, పోరాటం చేసిన సీనియర్ కార్యకర్తలు, ఆహ్వానితులతో సమావేశం ఉంటుందని… చివరి రోజు 30న పార్టీ రాష్ట్రస్థాయి క్రియాశీల కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ జరుగుతుందని.. మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభ ప్రారంభమవుతుందని, సాయంత్రం ఆరు గంటలకు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తారని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *