సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ కార్మికులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా లెఫ్ట్ పార్టీలు నిరసన ర్యాలీలు చేపట్టిన నేపథ్యంలో..భీమవరం స్థానిక ప్రకాశం చౌక్ లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలం మాట్లాడుతూ .. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అని గొప్పగా మాట్లాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఉక్కు ప్రైవేటు కు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులపై ఏకంగా పీడీ యాక్ట్ అమలు చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు విశాఖ కు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి విశాఖ ఉక్కుకి కార్మికులకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేని స్థితిలో ఉండి కార్మికుల ను బెదిరించడం మానుకోవాలి అన్నారు. లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్న పరిశ్రమకు గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా రానున్న కాలంలో ఇంటికి సాగడంపుతారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎం వైకుంఠరావు ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
