సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో నేడు, బుధవారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ లో కార్మిక సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో జాతీయా రహదారిపై రాస్తారోఖో నిర్వహించారు. ఈ సందర్బంగా విశాఖ ఉక్కు – ఆంధ్రులహక్కు, ప్రైవేటీకరణను అడ్డుకుంటాం -స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు అధ్యక్షతన జరిగిన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ 32మంది ప్రాణ త్యాగాలతో, వేలాదిమంది రైతుల భూములతో నిర్మించుకున్నామన్నారు. కానీ నేడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 4 లక్షల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేవలం 30 వేల కోట్లకు విదేశీ కంపెనీలకు అమ్మేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత 810రోజులుగా రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతులను కార్మిక వర్గం ఐక్యం చేసి మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తున్నాయని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ విశాఖఉక్కు – ఆంధ్రుల హక్కు అనే మహోద్యమంలో నిర్మించుకున్నదే విశాఖ ఉక్కు అన్నారు. 65 మంది సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవీ త్యాగాలతో సాధించుకున్నామన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జె ఎన్ వి గోపాలన్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం కారు చౌకగా అమ్మేస్తుంటే రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓట్ బ్యాంకు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా వేల కోట్లు లాభాలు గడించిన ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు అన్నారు.ఈ కార్యక్రమంలో ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు దండు శ్రీనివాసరాజు సిపిఎం నాయకులు జె.సత్యనారాయణ, ఎం. ఆంజనేయులు, డి. త్రిమూర్తులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కె. క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు.
