సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు .. అన్న నినాదంతో 4 దశాబ్దాల క్రితం 36 మంది బలిదానాలతో ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమ ను ఏకమొత్తంగా కాకపోయినా మొత్తానికి 44 వేరు వేరు విభాగాలుగా ప్రవేటు పరం చెయ్యడానికి శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో వంతుల వారీగా కార్మికుల తొలగింపులు జరుగుతున్నాయని విశాఖలో కార్మిక సంఘాలు , ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు జరుగుతున్నాయి. తాజగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌) 2, 3 విభాగాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఉత్పత్తికి అవసరమైన ముడి సరకు లేకపోవడంతో ప్లాంట్‌లో ఉన్న మూడు ఫర్నేస్‌లలో ఒకదానిలో మాత్రమే ఉత్పత్తిని కొనసాగిస్తూ.. మిగిలిన రెండు ఫర్నేస్‌లను డౌన్‌ చేశారు. బీఎఫ్‌ -1 (గోదావరి)లో కేవలం 5,198 మెట్రిక్‌ టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి జరిగింది. గత ఆదివారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ ప్రభావం ప్లాంట్‌లోని మిగతా విభాగాలపై పడింది. ఫలితంగా వాటిల్లో కూడా ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్లాంట్‌కు రా మెటీరియల్‌ కొరత కావాలనే జరుగుతుందని సంస్థను మరింత నష్టాలలోకి తోసెయ్యడం కోసమేనని,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందని? కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *