సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ ఎక్స్‌ప్రెస్ (Visakha Express) సికింద్రాబాద్ వైపు వెళుతుండగా పిడుగురాళ్ల వద్ద దుండగులు నేడు, ఆదివారం తెల్లవారుజామున భారీ దొంగతనానికి ప్రయత్నించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకుని.. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు (Railway police).. దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయపడిన దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు. పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఇటీవల పిడుగురాళ్ల సమీపంలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు వరుసగా రైళ్ళలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
