సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో నేడు, శుక్రవారం సీఎం చంద్రబాబు ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’’లో స్వర్ణ ఆంధ్ర ట్రాన్స్ఫామేషన్ ఇండియా టూ వికసిత భారత్ , ఏఐ ఫర్ ఎవరీ వన్ అనే రెండు పుస్తకాలు ను ఆవిష్కారించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ నగరం భవిష్యత్ నాలెడ్జ్ హబ్.. గత నా ప్రభుత్వ హయాంలో సంయుక్త ఆంధ్ర ప్రదేశ్‌లో 1995లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నామని.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ కూడా అప్పుడే తీసుకువచ్చామన్నారు. అప్పుడు ప్రారంభించిన ఐటీ టవర్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. గతంలో హ్యూమన్ రిసోర్స్ పట్ల చాలా వెనుకబడి ఉండేవాళ్లమన్నారు. అగ్రికల్చర్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, టెక్నిలజి విప్లవం వచ్చిందని.. ఇటీవల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెరిగాయన్నారు.ప్రధాని మోదీ కూడా డిజిటల్ టెక్నాలజీ పెంచుతున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను విశాఖ కేంద్రంగా నాలెడ్జి హబ్‌గా చేయడానికి 15% జీడీపీ పెరగాలని లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. ఒక్కప్పుడు జనాభా నష్టం అనుకున్నామని.. కానీ ఇప్పుడు అదే మన ఆస్తి అన్నారు.ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరి మన భారతీయుడు ఉన్నారని తెలిపారు.
