సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను విరమించిన పవన్ కల్యాణ్..తదుపరి సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగంలో ఎక్కడ ప్రధాని మోడీ ప్రస్తావన లేకుండా మాట్లాడటం విశేషం.. ఆయన ప్రసంగంలో .. రాష్ట్రంలో ఎన్నికయిన వైసిపి నేతలపై మండిపడ్డారు. ‘ప్లాంట్ కోసం వైసీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డ్ పట్టుకునే దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు మాకు శత్రువులు కాదని.. వారి విధానాలనే వ్యతిరేకిస్తున్నామన్నారు. పోరాడి తెచ్చుకున్న ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అనేది ఒక పరిశ్రమ మాత్రమే కాదని అది పోరాటాలకు, త్యాగాలకు గుర్తు అని చెప్పారు. ప్లాంట్ కోసం ఎంతోమంది ప్రాణాలు, పదవులు త్యాగాలు చేశారని పవన్ గుర్తు చేశారు. జనసేనకు అధికారం ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యే ఏ స్థాయిలో పని చేస్తారో చేసి చూపిస్తామన్నారు. ప్లాంట్ నిర్వాసితులకు జనసేన అండగా ఉంటుంది. విశాఖ ప్లాంట్‌ను పరిశ్రమగా చూడవద్దు. ఆంధ్రుల ఆత్మగౌరవంగా చూడాలని అమిత్‌షాకు నివేదించాం. వైసిపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి .. రాయలసీమ నేతలను గౌరవించని మీరా.. కర్నూలును న్యాయరాజధానిగా మార్చేది?. ఒక చిన్న భవనం కూడా కట్టని మీరు 3 రాజధానులు నిర్మిస్తారా?. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నవారిపై మాత్రం దాడులు చేస్తారు.’’ అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
