సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విదేశీ కాస్మో లుక్ ఉన్న విశాఖ పట్నంలో, గత 4 ఏళ్లుగా ప్రఖ్యాత ఐటి సంస్థలు వరుసగా ఆఫీసులు తెరుస్తూ క్యూ కడుతున్న నేపథ్యంలో ఇకపై హైదరాబాద్ కే కాదు ఆసియా ఖండం లోనే విశాఖ దశ తిరిగే అతిపెద్ద ప్రాజెక్టుకు నేడు మంగళవారం ఏపీ లో కూటమి ప్రభుత్వం ఒప్పందం కుదిరింది.. విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న డేటా సెంటర్.. ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతిపెద్ద డేటా సెంటర్ గా నిలవనుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” ప్రారంభించడానికి బాటలు పడ్డాయి. విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో నేడు..సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో నేడు మంగళవారం ఉదయం కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్,గూగుల్ ప్రతినిధుల మధ్య ఎంఓయుపై ఒప్పంద పత్రాలు ఫై సంతకాలు చేసారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఎపి ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం పాల్గొన్నారు.
