సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో తనదైన ప్రత్యేకతను చాటుకొనే కె ఏ పాల్ మరో ముందగు వేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్య క్షుడు కేఏ పాల్ విశాఖ పట్నంలో ప్రారంభించిన నిరవధిక దీక్ష నేడు, మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. కేంద్రంలోని మోడీ సర్కార్ చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసే వరకు తన నిరసన దీక్ష కొనసాగిస్తూనే ఉంటానని ప్రకటించిన కే ఏ పాల్ కు స్థానికుల నుండి మంచి సంఘీభావం మద్దతు వస్తుంది. కేంద్రం నుంచి కూడా అతి త్వరలోనే శుభవార్త ఉంటుందని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు నేతలు ప్రధాని మోడీ కి భయపడకుండా తనతో కల్సి రావాలని రాష్ట్రంలో ఎం పీలు, ఎమ్మెల్యే లు అంతా రాజీనామా చేసినప్పుడే కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *