సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుసగా కొన్ని నెలల విరామంతో వైజాగ్ వైపు ఒడిశాతోపాటు భారీ, చిన్న ప్రమాదాలతో పాటు గత ఆదివారం విజయనగరం జిల్లాలో జరిగిన వరుస ప్రమాదాలతో ఇటు భీమవరం , అటు తణుకు మీదుగా విశాఖపట్నం వైపు రైలు ప్రయాణమంటేనే ప్రయాణికులు భయపడిపోతున్నారు. అయితే జిల్లాలో గత రికార్డు చుస్తే విజయవాడ వైపు భోగీలు, ఇంజన్లు పట్టాలు తప్పడం, తప్ప ప్రాణనష్టం జరిగిన ప్రమాదాలు పెద్దగా జరగలేదు. ప్రస్తుతం జిల్లాలో భీమవరం నుండి అటు విజయవాడ, ఇటు నిడదవోలు, అటు నరసాపురం వరకు డబల్ ట్రాక్ , డబ్లింగ్ పనులు , రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు పూర్తయి ఏడాది కాలం గడుస్తుంది.ఎలక్ట్రికల్ లైన్లు వచ్చాయి కొత్త సిగ్నల్ వ్యవస్థ కావడంతో ప్రమాదాలకు ఆస్కారం లేదు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ 50 రైళ్లు పైగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో ఎక్కువ రైళ్లు భీమవరం జంక్షన్, టౌన్ రైల్వే మీదుగా ప్రయాణిస్తుండగా (దీనికి నరసాపురం, పాలకొల్లు, ఆకివీడు, తణుకు వంటి ప్రధాన స్టేషన్లు దగ్గర దగ్గరగా అనుసంధానంగా ఉంటాయి) ఐతే అటు మెయిన్ లైన్‌లో టీపీగూడెం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అవి ఏలూరు స్టేషన్ మీదుగా ఎక్కువ రాకపోకలు చేస్తాయి. ఇటు భీమవరం లైన్‌లో అటు విశాఖ పట్నం కాకినాడ, రాజమ హేంద్రవరం నుంచి వచ్చే రైళ్లు రాకపోకలు ఉన్నాయి. నరసాపురం నుంచి ప్రతి రోజు 24 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో నాగర్ సోల్, లింగంపల్లి, ధర్మవరం, గుంటూరు రైళ్లు కీలకం. ఉన్నాయి. ఈ రైళ్ల సర్వీస్ అంతా నరసాపురం స్టేషన్‌లోనే జరుగుతుంది. విశాఖ వైపు తో పోలిస్తే గోదావరి, కృష్ణ జిల్లాల మీదుగా రైల్వే ప్రమాదాలకు ఆస్కారం చాల తక్కువ.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్
