సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వైసీపీ హయాంలో రాజ్య శ్యామల యాగాన్ని ప్రశస్తంలోకి తెచ్చిన విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామికి తన గురువుగా మాజీ సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యం అందరికి తెలిసిందే..జగన్ హయాంలో ఆయనో రాజగురువుగావైసీపీ నేతల వద్ద గౌరవాలు అందుకోవడం చూసాం. అయితే తాజగా విశాఖ శారదా పీఠంకు గత వైసీపీ ప్రభుత్వం నామమాత్రపు రుసుముకు ఇచ్చిన 15 ఎకరాల కోట్ల రూపాయల విలువైన స్థలం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదా పీఠంకు ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే తిరుమల శ్రీవారి సన్నిధిలో శారద పీఠం చేపట్టిన నిర్మాణంపై కూడా నిబంధలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని టీటీడీకి (TTD) రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
