సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు,పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ భీమవరంలోని జిల్లా బీజేపీ కేంద్ర కార్యాలయంలో నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తీవ్ర నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) పునరుద్ధరణకు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్ర ప్రభుత్వం నడుంకట్టిందని, రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యా కేజీ ప్రకటిస్తే అందులో రూ.10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద, రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్గా కేటాయించామన్నారు. ఆంధ్రుల సెంటిమెంట్ ను గౌరవించి తమ విజ్ఞప్తి మేరకు ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మినహాయించి, కేంద్రం ఈ భారీ ప్యాకేజీ ప్రకటించిందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఉక్కు పరిశ్రమను కాపాడేం దుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజ్ ఇది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్యాకేజి సాధించినందుకు ఆంధ్రుడిగా గర్విస్తున్నాను. త్వరలో కేంద్ర మంత్రి కుమార స్వామి మన రాష్ట్రంలో పర్యటిస్తారు. ఆయన విశాఖ ఉక్కు కు మరో భారీ ప్యాకేజి ప్రకటించే అవకాశం ఉందన్నారు. విశాఖ స్టీల్ కు సొంత గనులు లేకపోవడం వల్ల నష్టాలు వచ్చాయన్నది వాస్తవం కాదన్నారు. దేశంలో స్టీల్ ఉత్పత్తి బాగా పెంచాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం . స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వేతన బకాయిలు నవంబర్, డిసెంబర్ జీతాలే రూ.230 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. త్వరలోనే చెల్లిస్తాం అన్నారు.
