సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు, సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను (RINL) సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లోని వివిధ విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్లాంట్ పురోగతిపై ఉన్నతాధికారులతో కలిసి వారు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మొదట పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు ప్లాంట్‌లోని కోక్ ఓవెన్ యూనిట్‌ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్లాంట్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా 27 జూన్ 2025న తిరిగి ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్-3 (BF-3) కార్యకలాపాలను నిశితంగా పరిశీలించారు. ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించడంలో ఈ విభాగం పోషిస్తున్న కీలక పాత్రను అధికారులు మంత్రులకు వివరించారు. గత మూడు నెలలుగా లాభాల బాటలో విశాఖ ఉక్కు:పయనించడం హర్షణీయమని కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.
