సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నేడు, శుక్రవారం కేంద్రం శుభవార్త ప్రకటించింది. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. అలాగే పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కూడా తమ వంతు కృషి చేసారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.‘విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ప్రత్యేక ధన్యవాదాలు. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈసాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
