సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళా కేంద్రం లోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. నరసింహారావు. ఇక ఫై విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగం లోనే నడపాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించడానికి ముడిసరుకు ఇచ్చేందుకు ఎన్ఎండీసీ సిద్ధంగా ఉందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అదే సమయంలో విశాఖ నుంచి వారణాసి ఎక్స్ ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. రైల్వే బోర్డు నుంచి వారణాసికి ఎక్స్ ప్రెస్ రైలు నడిపేందుకు ఆమోదం వచ్చింది. వారానికి రెండు రోజులు నడిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో దీన్ని రోజువారి రైలుగా నడిపే అవకాశం ఉంది. విజయదశమి లోపు ప్రారంభించాలని కోరాం ’ అని తెలిపారు.
