సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ బాషలలో మన sigmatelugu.in తాజా తాజా సమాచారాన్ని వెబ్ సైట్ లో వీక్షిస్తున్న వీక్షకులకు, మరియు వాట్స్ అప్ , పేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో వీక్షిస్తున్న వీక్షకులకు, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆన్ లైన్ న్యూస్ లో నెంబర్ 1గా నిలబెట్టిన వేలాది వీక్షకులకు ఈ కొత్త తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సరం ఎన్నో శుభాలు సుఖ శాంతులు కలుగజెయ్యాలని కోరుకొంటూ మీ ..సిగ్మా ప్రసాద్. చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటాము. ప్రధానంగా తెలుగు, కన్నడ ప్రజలకు అత్యంత పవిత్రమైన పండుగ ఇది. ఉగాది అంటే ‘యుగాది’ కొత్త యుగం ఆరంభం సూచిస్తుంది. మన తెలుగువారి ఉగాది పచ్చడి తయారు చేసి ఆరు రుచులను (తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు) సమన్వయం చేస్తారు. ఇది జీవితంలోఎదురయ్యే వివిధ రకాల అనుభవాలను సమంగా స్వీకరించడానికి అనుకొన్న గమ్యం సాధించడానికి స్ఫూర్తి నిచ్చే సంకేతం. పంచాంగ శ్రవణం, దేవాలయ దర్శనం, కొత్త పనులు ప్రారంభించడంతో ఈ కొత్త తెలుగు ఏడాది ప్రారంభమవుతుంది. విశ్వావసు అంటే ‘విశ్వసనీయమైన సంవత్సరం’. ఈ సంవత్సరం శాంతి, సమృద్ధి, సౌభాగ్యాన్ని తెస్తుందని నమ్ముతారు. గురు, శని గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారవేత్తలు, రైతులు, ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. పకృతి సహకరిస్తుంది. ప్రపంచ యుద్దాలు ఆగుతాయి. సమాజంలో సానుకూల మార్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.
