సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ మరియూ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. మంగం వేణు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధమ సంవత్సరం విద్యార్థులను ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సాదరంగా ఆహ్వానిస్తూ ఫ్రెషర్స్ డే వేడుకలు జరుపుట ఆనవాయితీగా వస్తుంది . ఆనతి కాలంలోనే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్స్ లో విష్ణు ఇన్స్టిట్యూషన్ అఫ్ టెక్నాలజీ 3వ స్థానంలో నిలచింది అని తెలియజేశారు. ఈ 2024వ సంవత్సరంలో భారతదేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ (ప్రైవేట్) కళాశాలల్లో విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, ది వీక్ మ్యాగజైన్ సర్వే ప్రకారం 120వ స్థానంలోనూ, అవుట్ లుక్ మ్యాగజైన్ సర్వే ప్రకారం 150వ స్థానంలోనూ మరియు ఇండియా టుడే మ్యాగజైన్ సర్వే ప్రకారం 152వ స్థానంలోనూ నిలిచినందుకు గర్వంగా ఉందని తెలియజేశారు. . తమ కళాశాలను ర్యాగింగ్ రహిత కళాశాలగా నిలిపిన సీనియర్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సంగీతం, నృత్యం, మిస్టర్ మరియు మిస్ ఫ్రెషర్స్, ర్యాంప్ వాక్ ప్రదర్శించి విజేతలు బహుమతులను పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *