సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విష్ణు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (అటానమస్) లో కాస్మిక్ కనెక్షన్స్ అనే అంశంపై TEDx సీజన్-2 ఈవెంట్ నేడు శనివారం ఘనంగా నిర్వహించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలియజేశారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారు పుస్తకాలకే పరిమితం కాకుండా ఇలాంటి ఈవెంట్స్‌లో పాల్గొని ప్రత్యక్ష ప్రసంగాల ద్వారా లోతైన చర్చలు జరిపి కొత్త కనెక్షన్లు ఏర్పరచుకోవాలని సూచించారు. TEDx సీజన్-1 ఈవెంట్ 2024 ఫిబ్రవరిలో నిర్వహించబడిందని, ఇదే విధంగా TEDx సీజన్-2 ఈవెంట్ కూడా విజయవంతంగా జరిగినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో TEDx విష్ణు ఇన్స్టిట్యూట్ ఆర్గనైజర్ మిస్టర్ సూరజ్ లంకేయ్ ,కో-ఆర్గనైజర్ వైష్ణవి దశిక, క్యురేటర్ ఆకాష్ రావు మల్లారెడ్డి TEDxతో తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా, TEDx స్పీకర్స్ అయిన టులిప్ గ్రూప్ పార్టనర్ మిస్టర్ సందీప్ ఇజ్రాని, ఈస్ట్ వెస్ట్ సీడ్స్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ హెడ్ మిస్టర్ బీజాయ్ బైరాగి, ఇన్స్పిరె ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ & సీఈఓ డాక్టర్ జె.వి.ఎస్. భాస్కర్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మిస్టర్ ఈశ్వర్ బోలెగర్, “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” నవల రచయిత మిస్టర్ రవి మంత్రి, ఫోర్ట్టున్ గ్రూప్ ఫౌండర్ & సీఈఓ మాస్టర్ రౌల్ హండా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్సల్టెంట్ మిస్ సాహితి దివీ, ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ మిస్టర్ కౌశిక్ మరిదీ తదితరులు పాల్గొన్నారు.
