సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరంలోని డాక్టర్ బి.వీ.రాజు ఫౌండేషన్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (అటానమస్) పరిశోధన మరియు అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఆర్&డి ప్రదర్శన-2025ను నేడు, శనివారం , అనగా 22 మార్చి 2025న విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు వర్చువల్‌గా ప్రసంగిస్తూ, విద్యాసంస్థల్లో పరిశోధన ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఎస్‌.డి.జి. ప్రాజెక్టులకు అనుసంధానం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సౌవెనీర్ విడుదలచేసారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌.ఆర్‌.ఎం యూనివర్సిటీ – ఆంధ్రప్రదేశ్, డీన్ ప్రొఫెసర్ రంజిత్ తాప మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో పరిశోధనా పర్యావరణ వ్యవస్థను సృష్టించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఇంకా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -ఏపీ ప్రొఫెసర్ డాక్టర్ కె. హిమబిందు ప్రస్తుత మరియు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల గురించి వివరిస్తూ, చాట్‌జీపీటీ మరియు ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ సాంకేతికతలు ప్రపంచాన్ని రూపొందించడంలో ఎలా సహాయపడుతున్నాయో, విద్యార్థులుకు వివరించారు. .వరంగల్ నిట్ , ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 380 మంది విద్యార్థులు ప్రాజెక్ట్ ఎక్స్పో విభాగంలో 50 హార్డ్వేర్ ప్రాజెక్ట్స్, 43 సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *