సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని డా. బి.వి. రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు నేడు, బుధవారం “స్పార్క్ ట్యాంక్ – 2023 ఫైనల్స్” కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ డా. దశిక సూర్యనారాయణ ప్రకటించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు విమర్శనాత్మక ఆలోచన, సహకారం, సృజనాత్మకత మరియు కమ్యూనికేషన్ వంటివి కలిగి ఉండాలి అని అన్నారు. “స్పార్క్ ట్యాంక్’ యొక్క ముఖ్యమైన ఉద్దేశం పరిష్కారాన్ని చురుగ్గా ఆలోచించి ముందుకు తీసుకురావడానికి విద్యార్థులను ప్రేరేపించడం అని అన్నారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన VEDIC డైరెక్టర్ డాక్టర్ M.K. కౌశిక్ మాట్లాడుతూ .. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన స్పార్క్ ట్యాంక్-2023 బిజినెస్ క్లాస్ మోడల్ లాగా ఉంది అని, కార్యక్రమం IITs. మరియు NITs ప్రమాణాలలో నిర్వహించబడింది అని అన్నారు.. అనంతరం విజేతలకు ట్రోఫీ మరియు చెక్కులు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో విష్ణు .. ఇన్నోవేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ వి ఎస్ ఎన్ నరసింహరాజు మాట్లాడుతూ మొత్తం 120 జట్లు పాల్గొన్నారు అని అందులో ఈ రోజు 9 జట్లు ఫైనల్ లో నిలిచాయని అన్నారు. సమస్య, ప్రెజెంటేషన్, అప్లికేషన్ మరియు ఫోటోటైప్ ఆధారంగా విజేతలను ప్రకటించారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.కె.శ్రీనివాస్, విభాగాధిపతులు,బోధన, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *