సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని డాక్టర్ బి వి రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ, వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అటానమస్) ప్రధమ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించామని డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ దశిక సూర్యనారాయణ తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ 2019 -23 బ్యాచ్ కి చెందిన 775 మంది బీ.టెక్ విద్యార్థులకు, 2021-23 బ్యాచ్ కి చెందిన 22 మంది ఎం.టెక్ విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మరియు అకడమిక్ టాపర్స్ కు పతకాలు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆమెరికాలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించామని దానికి వచ్చిన అనూహ్య స్పందనని ఉదహరిస్తూ ఒక కాలేజీ అభివృద్ధి చెందడంలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ పెన్ స్టేట్ యూనివర్సిటీ, బింగ్ హాస్టన్ యూనివర్సిటీ వంటి ప్రముఖ యూనివర్సిటీలతో ఎం.ఓ.యు కుదుర్చుకున్నాదని వీటి ద్వారా విష్ణు విద్యార్థులు అమెరికాలో మరియు కెనడాలో చదువుకునే అవకాశం ఉందన్నారు. తమ కళాశాల రాష్ట్రంలో ప్లేస్మెంట్స్ లో మూడో స్థానంలో నిలిచిందని గర్వంగా తెలియజేశారు. ఈ బ్యాచ్ విద్యార్థులు 90 శాతం పైగా ప్లేస్మెంట్స్ సాధించారని విద్యార్థులను అభినందించారు.. ఈ కార్యక్రమంలో మొత్తం 797 మంది పట్టభద్రులు, వెయ్యి మందికి పైగా తల్లిదండ్రులు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే శ్రీనివాస్ ,డీన్స్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
