సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె. మధు మూర్తి నేడు భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, లో నేడు, బుధవారం పర్యటించి అక్కడి విద్యాసంస్థలను, అంతర్జాతీయ ప్రమాణాలతో వాటిని నిర్వహిస్తున్న తీరును ఆధునిక వసతులను పరిశీలించిన తదుపరి, ఆడిటోరియం నందు (శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, కె.వి. విష్ణు రాజు, అధ్యక్షతన నిర్వహించబడిన )వికలాంగుల దినోత్సవం సభ లో మాట్లాడుతూ.. ఇక్కడి విద్యారుల కోసం అసిస్టివ్ టెక్నాలజీ లేబోరేటరీలను కళాశాలల యందు స్థాపించి, సాంకేతిక విజ్ఞ్యాన్ని, సమాజ సేవ నిమిత్తం ఉపయోగపడేలా విద్యార్థులను ప్రోత్సహించి, ఇటువంటి వికలాంగులకు ఉపయోగపడే పరికరాలను టూల్స్ ను విద్యార్థుల చేత తయారు చేయించి, వికలాంగులకు ప్రతి సంవత్సరం ఉచితంగా పంపిణి చేయడమనేది చాల అభినందనీయం అన్నారు. సమాజానికి ఉపయోగపడే వివిధ రకాల సాంకేతిక పరికరాల తయారీ, కేవలం మన ప్రాంతానికే పరిమితం కాకుండా, వివిధ ప్రాంతాల విద్యార్థులకు, లబ్దిదారులకు కూడా లాభాన్ని చేకూర్చే విధంగా విష్ణు కళాశాల ఒక యూనివర్సిటీగా రూపాంతరం చెందాలని ఇక్కడకు వచ్చినందుకు తాను గర్వపడుతున్నానని ఆకాంక్షించారు. కె.వి. విష్ణు రాజు మాట్లాడుతూ.., తమ కళాశాలలు అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుని అసిస్టివ్ టెక్నాలజీ ల్యాబొరేటరీలను స్థాపించాయని తెలిపారు. డాక్టర్ యు.వి. రమణ రాజు మాట్లాడుతూ విష్ణు కళాశాలల సాంకేతిక కృషిని కొనియాడుతూ, 2009 సంవత్సరంలో అసిస్టివ్ టెక్నాలజీ లేబోరేటరీని కళాశాలలో స్థాపించి, గత 16 సంవత్సరాల నుండి నిరంతరం ప్రతి సంవత్సరం సమాజంలోని వికలాంగుల సమస్యలకు ఆధునిక సాంకేతిక పరికరాలను ఉచితంగా అందిస్తున్నందుకు కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు.
