సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణ శివారులోని విస్సా కోడేరులో నివాసం ఉంటున్న పాలూరి అన్వేష్ (28) అనే తాపీ మేస్త్రి నేడు,. బుధవారం తన ఇంట్లో మరో వ్యక్తి అప్పన్న తో కలిసి తాపీ పనులు చేస్తుండగా గది చీకటిగా ఉందని వెలుగు కోసం బల్బు ఏర్పా టు చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అన్వేష్, అప్పన్న ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదం లో అన్వేష్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వెంటనే స్థానికులు అతనిని భీమవరంలోని ఓ ప్రైవేట్ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని భార్య ధనలక్ష్మి కి ముగ్గరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి దూరం కావడంతో ముగ్గురు చిన్నారులు పరిస్థితి తలచుకొని కుటుంబ సభ్యులు ఆ ప్రాంత వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *