సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారులోని పాలకోడేరు మండలం విస్సాకోడేరు శృంగవృక్షం, పంచాయితీలలో ఒక్కొక్క పంచాయితీలో 36 లక్షల రూపాయల చప్పున వ్యయంతో నిర్మించనున్న నూతన “ప్రాథమిక ఆరోగ్య కేంద్రం” ల నిర్మాణ పనులకు శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు నేడు, మంగళవారం శంఖుస్థాపన చేశారు. నాలుగు నెలలలో వీటి నిర్మాణం పూర్తి చేసి, ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని రఘురామ తెలిపారు. ఉండి నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 22,00,000/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను 25 మంది లబ్ధిదారులకు నేడు, మంగళవారం రఘురామా అంజేశారు. తదుపరి లబ్దిదారుల ఆరోగ్య పరిస్థితిని రఘురామ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్, కొత్తపల్లి నాగరాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *