సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: . సినీ పరిశ్రమలోప్రత్యేక పంధాలో నడిచే గౌరవం ఉన్న నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి (R Narayana murthy) నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉంది. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నాను. అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫై ధ్వజం ఎత్తారు. థియేటర్ల పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. ‘హరిహర వీరమల్ల్లు’ కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది. కుట్ర జరిగిందన్నది అబద్థం. డెప్యూటీ సీఎం స్థాయిలో ఉండి పవన్ పరిశ్రమ పెద్దలను థియేటర్స్ వారిని పిలిచి ప్రభుత్వం తరపున పర్సంటేజీ సమస్యను పరిశీలిస్తానని చెప్పి ఉంటే ఆయన గౌరవం పెరిగిఉండేది. ఎటువంటి కుట్ర లేకపోయిన ఆయన కార్యాలయం నుండి అటువంటి లేఖలు రావడం సముచితం కాదు.. ( ఇప్పటికి సినిమా పెద్దలు సీఎం చంద్రబాబు ను కలవలేదు. ఇక చర్చలు లేవు. రిటన్ గిఫ్ట్ ఇస్తారు కదా?) మీరు రాజులా ? మీరు గెలిచాక మీ వద్దకు మేము రావాలా? మీరు పిలిస్తే అలానే వస్తాం.. కానీ ఇలాంటి వైఖరి పవన్ కు మంచిది కాదు. ఎన్టీఆర్ తరువాత రాజకీయంగా ఉప సీఎం అయిన ఉన్నత స్థాయికి ఎదిగిన సినిమా హీరోగా మేము ఆయనను గొప్పగా అభిమానిస్తాం. అంతే కానీ , సింగిల్ థియేటర్స్ బంద్ వంటి బ్రహ్మాస్తం దెబ్బకు ఒక కొలిక్కి వచ్చే దశలో ‘హరిహర వీరమల్లు’కు లింకు పెట్టడం సరికాదు. ఈ విషయాన్ని కార్పొరేట్ సంస్థల కోసం మల్టి ఫ్లెక్స్ లకోసం పక్కదారి పట్టించవద్దు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి?. సింగిల్ థియేటర్లు కల్యాణ మండపాలు అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 1000 పైగా థియేటర్స్ మూసివేశారు. మిగతావి కాపాడుకోవాలి అంటూ ఆర్ నారాయణమూర్తి పవన్ కు విజ్ఞప్తి చేసారు.
