సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాకుండా కుట్ర జరుగుతుందని ఏపీ డెప్యూటీ సీఎం పవన్ హెచ్చరికలతో థియేటర్స్ బంద్ వాయిదా వేసిన సినిమా పెద్దలు తీరా చుస్తే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ వాయిదా పడటంతో సినీ పెద్దలు గొంతులు సవరించుకొంటున్నారు. మొదటగా ఆర్ నారాయణమూర్తి సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను నిర్వాహకులను తక్కువ చూడవద్దని, 2ఏళ్లకు 3 ఏళ్లకు సినిమా షూటింగ్లు ఏమిటని ప్రశ్నించారు. తరువాత అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ కు కూడా అత్యంత సన్నిహితుడు ‘బన్నీ వాసు’ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం.. అసలు సినిమా థియేటర్స్ కు ఈ పరిస్థితి తెచ్చింది పెద్ద హీరోలేనని. ఒక్కొక్క అగ్ర హీరో 3ఏళ్లకు ఒక సినిమా చేస్తే సినిమా థియేటర్స్ ఎలా నిర్వహించాలని? ప్రశ్నిస్తూ వచ్చే 4 ఏళ్లలో అన్ని మూతబడతాయని హెచ్చరించారు. ఇక తాజగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్య వర్గానికి మూడోసారి అధ్య క్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ లు తాజగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హీరోలు దేవుళ్లు లాంటి వారని, అందులో పవన్ కళ్యాణ్ తుపాను లాంటి వారని ఆయన సినిమా కోసం బంద్ చెయ్యడం గాని వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని వ్యాఖ్యానించారు. ఒక్కో హీరో రెండేళ్లకో సినిమా చేయడం వల్ల సింగిల్ స్క్రీ న్ థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైందని జనవరి నుంచి మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయని, ఇంతా చేసి పవన్ కల్యాణ్ సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందని వాపోయారు. ఇప్పడు తమ పరిస్థితి ఏంటని, ఎవరు సమాధానం చెపుతారని ప్రశ్నించారు. హీరోలకు స్టార్ హోదా ఎక్కడి నుంచి వచ్చింది. హీరోలకు ఫ్లాప్ అయినా రెమునేషన్స్ పెంచేస్తున్నారు. మరి సింగిల్ థియేటర్స్ వార్లు మాత్రం నష్టపోవాలి.. అందుకే ఇకపై సింగిల్ స్క్రీ న్ థియేటర్లను మల్టీప్లెక్స్ తరహాలోనే నిర్వహణ చేసుకుంటున్నాం.(ఇటీవల ఏపీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని థియేటర్స్ లో కాంటీన్ రేట్లపై అధికారులు దాడులు చేసారు ఆ నేపథ్యంలో..) ప్రేక్షకుడికి తక్కువ ధరతో పాటు, 80 రూపాయల్లోనే పాప్ కార్న్, 30రూపాయలకే కూల్ డ్రింక్స్ అందిస్తున్నాం. మేము నష్టపోకూడదు కదా ’’ అని శ్రీధర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *