సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలోని నందమూరు గరువు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు తదుపరి, వీరవాసరం లోని జెడ్పీ హైస్కూల్లో నేడు, శుక్రవారం నుండి మూడురోజుల పాటు జరిగే 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గ్రేమ్స్ ఫెడరేషన్ అండర్ – 17 బాలుర బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ ను స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్తో కలసి క్రీడ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 468 క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని, గెలుపు ఓటములు సహజమని, క్రీడ స్పూర్తితో క్రీడలను ఆస్వాదించాలన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి పిఎస్ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి 468 మంది బాలుర బాలికలు, కోచ్ మేనేజర్లు పాల్గొంటున్నారని, మూడు రోజులు జరిగే ఈ పోటీల్లో 16 మంది బాలురులు, 16 బాలికలు జనవరిలో రాయగడ్ జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతారని, తెలిపారు. కార్యక్రమంలో జనసేన జెడ్పీటీసీ, గుండా జయప్రకాశ్ నాయుడు ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లు, గ్రామ పెద్దలు,విద్యార్థులు పీఈటిలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *