సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో నేడు, బుధవారం జిల్లా రొయ్య రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలలు, తొక్కలు వలచి శుద్ధి చేసిన రొయ్యల అమ్మకాల కేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు రొయ్యలను ఎక్కువగా తినాలని, రొయ్యలు ఆరోగ్యానికి మంచివేనని, ఆక్వా రంగానికి ప్రభుత్వం మేలు చేస్తుందని, ప్రోసెసింగ్ చేసి రొయ్యలను శుద్ధి చేసి అన్ని రకాల కౌంట్ రొయ్యలను ఇక్కడ అందించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి వీరవల్లి దుర్గాభవాని, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, గొట్టుముక్కల సుబ్బరాజు, మళ్ల రాంబాబు, వీరవల్లి చంద్రశేఖర్, యరకరాజు చినబాబు, తోట విజయ్ కుమార్, గుళ్ళపల్లి విజయలక్ష్మి, యరకరాజు గోపాలకృష్ణ, యరకరాజు హరిబాబు, కడల ప్రసాద్, జవ్వాది బాలాజీ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
