సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇప్పటికే సంక్రాంతి సంబరాలు అన్ని ప్రాంతాలలో స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రారంభమయ్యాయి. ఇక ఆటలా పోటీలు కూడా ప్రారంభమౌతున్నాయి. నేడు, ఆదివారం వీరవాసరం గ్రామంలో జనసేన పార్టీ జడ్పీటీసీ గుండా జయప్రకాష్ సహకారంతో కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీ లను అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో సంక్రాంతి సంప్రదాయాన్ని కొనసాగించేలా ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి సంబరాలలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ముందుగా వీరవాసరం పశ్చిమ కాలువ నుంచి క్రీడాకారులందరూ భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం క్రీడా పోటీలను వారు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *