సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, . బుధవారం జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మరియు మాజీ ఎంపీ, టీడీపీ,పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు తోట సీతారామ లక్ష్మి తో మరియు ఇరు పార్టీల నేతలతో కలసి భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భముగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ చేతికొచ్చిన పంట పోగొట్టుకొన్న రైతుల కన్నీరు కదిలిస్తోంది.. తుపాను నష్టం అంచనాలకు అందకుండా ఉంది. నిర్లక్ష్యాన్ని వదిలి రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలి అన్నారు. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా తక్షణ సాయం కింద ప్రతి రైతుకి రూ. 20 వేల ఆర్ధిక సాయం అందించాలన్నారు. ముందే కాలువలు మరమ్మతులు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రతి గింజా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ప్రతి గింజా కొనుగోలు చేసే వరకు జనసిన టీడీపీ కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. రైతుల పక్షాన నిలబడతాం, అని అన్నారు.
