సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు, సోమవారం వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుమారు రూ 5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. రూ 2.50 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు, రూ 3 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళుతూనే, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండగ పేరిట ప్రతి గ్రామంలోనూ వాడవాడల సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో గుంటలు లేని రహదారుల నిర్మాణాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ, మరియు గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
