సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వీరవాసరం గ్రామానికి చెందిన సుమారు 50 మంది జనసేన పార్టీ సీనియర్ నేతలు , కార్యకర్తలు నేడు, శనివారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో చేరినట్లు ప్రకటించారు. వీరవాసరం ప్రాంతంలో సీనియర్ నేతలు మద్దాల సోమయ్య, కంచర్ల బోసు, బండి ప్రసాద్, మద్దాల బాబులు, మద్దాల అంజయ్య, చేగొండి తాతాజీ, ఉంగరాల రాంబాబు, తన్నీడి బాలాజీ, ముక్కు శ్రీనివాస్, రేడియో మూర్తి, జడ్డు నాని, కడ్ల రామకృష్ణ, మద్దాల శ్రీధర్ తదితరులు వైసీపీలో చేరగా వారికీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ లో ఆత్మాభిమానం తో పనిచెయ్యవచ్చునని ఎవరి పల్లకీలు మోయవలసిన అవసరం లేదని సీఎం జగన్ చేసిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి వైసీపీ కి ప్రధాన ఆయుధాలు అని మీ రాకతో వీరవాసరం ప్రాంతంలో వైసీపీ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *